టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో భారత్ పోరాడి ఓడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇరు జట్లు 387 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులు చేసింది. టార్గెట్ ఛేజింగ్ లో బరిలోకి దిగిన భారత్ 170 పరుగులకే కుప్పకూలింది. చివరిదైన ఐదో రోజు 58-4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ను కట్టడి చేయడంలో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టడి చేశారు. బ్యాటింగ్ వైఫల్యమే భారత్ పరాజయానికి కారణం. కే.ఎల్.రాహుల్ (39) అవుటైన తర్వాత మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. రవీంద్ర జడేజా (61 నాటౌట్) ఒక్కడే పోరాడాడు. అతనికి అవతలి ఎండ్ నుండి సహాకారం కొరవడింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, బెన్ స్టోక్స్ 3 వికెట్లు, కార్సే 2 వికెట్లు, వోక్స్, బషీర్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు