టెండూల్కర్- అండర్సన్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటయింది. సాయి సుదర్శన్ 61 (151; 7×4), యశస్వీ జైశ్వాల్ 58 (107; 10×4, 1×6), రిషబ్ పంత్ 54 (75; 3×4, 2×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా గాయంతో బాధపడుతున్నా కూడా రిషబ్ పంత్ పోరాడిన తీరు భారత అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియా వేదికగా పంత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
కే.ఎల్.రాహుల్ (46), శార్థుల్ ఠాకూర్ (41), వాషింగ్టన్ సుందర్ (27) పరుగులు చేయడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో ఈ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో సత్తా చాటాడు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, వోక్స్ 1 వికెట్, డాసన్ 1 వికెట్ తీశారు. ప్రస్తుతం రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆరంభించింది.
మాంచెస్టర్ టెస్టు: భారత్ మొదటి ఇన్నింగ్స్ 358 ఆలౌట్: రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్
By admin1 Min Read