భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 204-6తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 224 పరుగులకు ఆలౌటయింది. కరుణ్ నాయర్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. , వాషింగ్టన్ సుందర్ (26), యశస్వీ జైశ్వాల్ (2), కే.ఎల్.రాహుల్ (14), శుభ్ మాన్ గిల్ (21), సాయి సుదర్శన్ (38), జడేజా (9), ధ్రువ్ జురెల్ (19) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్ సన్ 5 వికెట్లు, టంగ్ 3 వికెట్లు, వోక్స్ 1 వికెట్ తీశారు. ఇక అనంతరం మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది. క్రాలీ (64), డకెట్ (43) లు మొదటి వికెట్ కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. హ్యారీ బ్రూక్ (53) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓలి పోప్ (22), జో రూట్ (29) పరుగులు చేశారు. ఒక దశలో భారీ ఆధిక్యం సాధించేలా కనిపించిన ఇంగ్లాండ్ ను సిరాజ్ (4/86), ప్రసీద్ కృష్ణ (4/62) కట్టడి చేశారు. అర్ష్ దీప్ కు ఒక వికెట్ దక్కింది. దీంతో ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతోంది.
ఆసక్తికరంగా ఓవల్ టెస్టు… ఇంగ్లాండ్ 247 ఆలౌట్… రాణించిన సిరాజ్, ప్రసీద్ కృష్ణ
By admin1 Min Read