భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఐపీఎల్ తర్వాత రోహిత్ కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్.. వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అతను గత ఏడాదే టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. రోహిత్ కు నాయర్ పర్సనల్ కోచ్ కూడా. నాయర్ ఇంతకుముందు కార్తీక్, రాహుల్, రింకు సింగ్లతో కూడా కలిసి పనిచేశాడు. రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ లో ఆడేదానిపై చర్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వన్డే దిగ్గజం ఆ ఫార్మాట్లో 32 సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్ పై భారత్ గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు