ఇటీవల జరిగిన టీ20 సిరీస్ లో వరుస శతకాలతో చెలరేగిన భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టాప్-10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా 69 స్థానాలు మెరుగు పరుచుకుని సూర్యకుమార్ యాదవ్ ను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. తిలక్ వర్మ తన టీ20 కెరీర్లో టాప్-10లో నిలవడం ఇదే మొదటిసారి. వరుసగా రెండు మ్యాచ్ లలో శతకాలు బాది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. సౌతాఫ్రికా నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో తిలక్ 198 స్ట్రైక్ రేటుతో 280 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్ లలో కలిపి 20 సిక్సర్లు కొట్టాడు. ఇక రెండు శతకాలు చేసి ఆకట్టుకున్న మరో బ్యాటర్ సంజు శాంసన్ 17 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో నిలిచాడు. అతను తన ఐదు ఇన్నింగ్స్ ల్లో మూడు శతకాలు ఉండటం విశేషం. యశస్వి జైస్వాల్ 8వ స్థానంలో, రుతురాజ్ గైక్వాడ్ 15వ స్థానంలో ఉన్నారు. ఆల్ రౌండర్ భాగంలో హార్దిక్ పాండ్య రెండు స్థానాలు మెరుగై తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగై టాప్-10లోకి వెళ్లాడు. అతను ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. రవి బిష్ణోయ్ ఒక స్థానం దిగజారి ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. భారత్ మీద మూడో టీ20లో 17 బంతుల్లోనే 54 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా పేస్ ఆల్ రౌండర్ టెన్సన్ 65 స్థానాలు ఎగబాకి 14వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు