ఇటీవల న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో ఘోర పరాజయాన్ని మూట కట్టుకుని మళ్లీ తిరిగి గెలుపు బాట పట్టాలనే లక్ష్యంతో ఆసీస్ తో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ సిరీస్ కు సిద్ధమవుతుంది. రేపు పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదటి టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6-10వరకు రెండో టెస్టు, బ్రిస్బేన్ లో డిసెంబర్ 14-18వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30వరకు మెల్ బోర్న్ లో నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు), సిడ్నీ వేదికగా జనవరి 3-7 వరకు ఐదో టెస్టు జరుగనున్నాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సిరీస్ పట్ల ఇరు దేశాల అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు దేశాల సారథులు ట్రోఫీ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇక గతసారి ఆస్ట్రేలియాలో పర్యటించిన రెండు సార్లు భారత్ దే విజయం కావడం గమనార్హం. మళ్లీ భారత జట్టు విజయం సాధించి సత్తా చాటాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్ లో రాణించాలని భారత ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. కంగారులపై భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తే పలు కొత్త రికార్డులు సృష్టిస్తారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పై సర్వత్రా ఆసక్తి: పెర్త్ వేదికగా రేపే మొదటి టెస్టు
By admin1 Min Read