పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ భారత బౌలింగ్ ధాటికి 104 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బూమ్రా 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 150 పురుషులకే ఆలౌటయిన సంగతి తెలిసిందే. ఆసీస్ బ్యాటింగ్ భారత బౌలర్ల ధాటికి తడబడింది. భారత కెప్టెన్ బుమ్రా కళ్లు చెదిరే బంతులతో మొదటి నాథన్ (10), కవాజా (8), స్మిత్ (0) మూడు వికెట్లు పడగొట్టి మొదటి రోజే ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. ట్రావిస్ హెడ్ (13) ను హార్షిత్ రాణా బౌల్డ్ చేశాడు. మార్ష్ (6), లబూషేన్ (2) ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 47 పరుగులకే ఆసీస్ 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (3) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ అలెక్స్ క్యారీ (21), స్టార్క్ (26) లైయాన్ (5) వికెట్లు పడగొట్టి మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యం సాధించింది. బుమ్రా 5 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, హార్షిత్ రాణా 3వికెట్లు పడగొట్టారు.
Pic credits: BCCI twitter
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు