ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ చేతిలో ఓటమి చెందాడు. ఉత్కంఠభరితంగా జరిగిన ఆటలో లిరెన్ 42 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. ఇప్పుడు అతడి ఖాతాలో ఒక పాయింట్ చేరింది. ఈ గేమ్ లో గుకేశ్ తెల్ల పావులతో ఆడాడు. లిరెన్ నల్ల పావులతో ఆడాడు.
టోర్నీలో మొదట 7.5 పాయింట్లకు చేరుకున్న ఆటగాడు విజేతగా నిలుస్తాడు. మిడిల్ గేమ్లో ముకేశ్ తడబడ్డాడు. భారత్ తరపున ఇప్పటివరకు విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచాడు. తదుపరి గేమ్ లో గుకేశ్ పైచేయి సాధించాలని చెస్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Previous Articleఅటవీ శాఖ ఉన్నతాధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష
Next Article మరోసారి డేవిస్ కప్ విజేతగా ఇటలీ