ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని భారత్ తిరిగి సాధించింది.
స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో పేలవ ప్రదర్శనతో 3-0 సిరీస్ కోల్పోయి అగ్రస్థానం చేజార్చుకున్న భారత జట్టు బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి 61.11 విజయశాతంతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ చేతిలో ఘోర పరాజయంతో ఆస్ట్రేలియా (57.69) టాప్ ర్యాంకు కోల్పోయి రెండో స్థానానికి పరిమితమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో శ్రీలంక (55.56), 4వ స్థానంలోన్యూజిలాండ్ (54,55), 5వ స్థానంలో దక్షిణాఫ్రికా (54,17), 6వ స్థానంలో ఇంగ్లాండ్ (40.79), 7వ స్థానంలో పాకిస్థాన్ (33.33), 8వ స్థానంలో బంగ్లాదేశ్ (27.50), 9వ స్థానంలో వెస్టిండీస్ (18.52) ఉన్నాయి.
Previous Articleమరోసారి డేవిస్ కప్ విజేతగా ఇటలీ
Next Article పీఎంశ్రీ పథకం మొదటి దశ కింద ఏపీలో 855 పాఠశాలల ఎంపిక