సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో భారత టాప్ షట్లర్లు పివి.సింధు, లక్ష్యసేన్ క్వార్టర్స్ లో గెలుపొంది సెమీ ఫైనల్ చేరుకున్నారు. టాప్ సీడ్ సింధు మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో చైనాకు చెందిన డాయ్ వాంగ్ పై 21-15, 21-17తో నెగ్గింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ 21-8, 21-19తో గెలిచాడు.
ప్రియాన్షు రజావత్ 21-13, 21-8తో వియత్నాంకు చెందిన డాంగ్ నుయెన్ పై గెలిచి సెమీస్ చేరాడు. ఉన్నతి హుడా అమెరికాకు చెందిన ఇషిక పై 21-16, 21-9 తో గెలిచి సెమీస్ చేరింది. మహిళల డబుల్స్ లో గాయత్రి-ట్రీసా ద్వయం, పురుషుల డబుల్స్ లో పృథ్వి-సాయి ప్రతీక్ కూడా గెలిచి సెమీస్ చేరారు.
Previous Articleప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్: ‘డ్రా’గా నాలుగో గేమ్
Next Article దేశంలో పెరిగిన సబ్బుల ధరలు..!