2025 ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి హైబ్రిడ్ మోడల్ కు ఆతిథ్యం ఇవ్వనున్న పాక్ అంగీకారం తెలిపింది. అయితే దీనికి ఒక మెలిక పెట్టింది. భారత్ పాక్ కు వెళ్లడం నిరాకరించిన నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ ఒకటే పరిష్కారమని ఐసీసీ పేర్కొనగా… దీనిపై పాక్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. హైబ్రిడ్ మోడల్ కు సరే నని కానీ భవిష్యత్తులో తమ జట్టు కూడా ఐసీసీ టోర్నీలలో భారత్ కు వెళ్లకూడదని నిర్ణయిస్తే తమకు ఇదే విధంగా హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు ఏర్పాటు చేయాలని కోరింది. రెండు జట్లకు సమానంగా ఏ నిర్ణయం మైన ఉండాలని కోరింది.
పాకిస్థాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కాగా, భధ్రతా కారణాలు రీత్యా బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపేందుకు నిరాకరించింది. భారత్ ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించే విధంగా ఐసీసీ, బీసీసీఐ ప్రతిపాదించగా.. పాకిస్థాన్ మాత్రం మొత్తం మ్యాచ్ లు తమ దేశంలోనే జరగాలని పట్టుబడుతోంది. తాజాగా జరిగిన ఐసీసీ సమావేశంలోనూ ఇదే వైఖరితో పాక్ ఉండడంతో ఐసీసీ పాక్ కు తేల్చి చెప్పింది. హైబ్రిడ్ మోడల్ కు అంగీకరిస్తే సరేనని లేకుంటే నిర్వహణ నుండి తప్పుకోవాలని సూచించింది. హైబ్రిడ్ మోడల్ కు అంగీకరిస్తే తటస్థ వేదికపై యూఏఈలో మ్యాచ్ లు జరుగుతాయి. హైబ్రిడ్ మోడల్ ఒకటే పాక్ లో మ్యాచ్ లు జరిగేందుకు పరిష్కారమని ఐసీసీ పాక్ కు తెలిపింది. భారత్ ఒకవేళ ఆడకపోతే ఆ ప్రభావం ట్రోఫీపై తీవ్రంగా ఉంటుంది. దీంతో ఐసీసీ పాక్ కు తేల్చి చెప్పింది. దీంతో పాక్ బోర్డు హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించింది.
Previous Articleప్రతిదాడి మమ్మల్ని మరింత బలపరుస్తుంది:- గౌతమ్ అదానీ
Next Article ఎన్టీఆర్ చిత్రంలో తెలుగు అమ్మాయి…!