ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ సంచలనం సృష్టించాడు. విశ్వనాథాన్ ఆనంద్ తరువాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తాజాగా జరిగిన చివరిదైన 14వ గేమ్ లో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ గేమ్ కు ముందు ఇరువురు ఆటగాళ్లు 6.5-6.5 తో సమంగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు మొదటి గేమ్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ గెలుపొందగా.. రెండో గేమ్ డ్రా అయింది. మూడో గేమ్ లో భారత యువ కెరటం గుకేశ్ విజయం సాధించాడు. ఆతర్వాత నుండి వరుసగా 7 డ్రా లతో ఈ ఛాంపియన్ షిప్ సాగింది. తరువాత గుకేశ్, లిరెన్ లు చెరొక విజయంతో నిలిచారు. మొత్తంగా ఇద్దరూ చెరొక రెండు గెలుపులు సాధించారు. అనంతరం జరిగిన డ్రాతో మొత్తం 9 గేమ్ లు డ్రా అయ్యాయి. ఇక ఈ ఛాంపియన్ షిప్ లో నిర్ణయాత్మక చివరి గేమ్ లో విజయంతో భారత్ కు అపూర్వమైన విజయాన్ని అందించాడు. గుకేశ్ సాధించిన విజయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సహా క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు.
Previous Articleమోహన్ బాబు ఆడియో మెసేజ్.. నేను కావాలని కొట్టలేదు
Next Article నా సినిమాలు హిట్ కావడానికి కారణం అదే : నయనతార