కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎయిమ్స్ వద్ద భద్రతను పెంచారు.
మన్మోహన్ సింగ్ ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ అభ్యున్నతికి అభివృద్ధికి కృషి చేశారు. అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుండి 1996 వరకు అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. యూపీఏ హయాంలో 2004 నుండి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Previous Articleభారత దేశ మ్యాప్ ను తప్పుగా చిత్రీకరించిన కాంగ్రెస్ …!
Next Article పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు