Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » జనసైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి…!
    Trending News

    జనసైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి…!

    By adminJanuary 26, 20252 Mins Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టిడిపి బిజేపి NDA కూటమి సాదించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం, ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్ట సభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫ్యల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావులేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు, సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, బావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో 164/175 స్థానాలను NDA కూటమికి, 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21/21 అసెంబ్లీ స్థానాలు, 2/2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారు. కట్టబెట్టారు. ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలచుకుని అధికారం చేపట్టిన రోజు నుండి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ, సహకారాలతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాదించే దిశగా చిత్తశుద్దితో పనిచేస్తుంది. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న, మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుకెళ్తున్నా సరే దానంతటికి కారణం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృడ సంకల్పమే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన భాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణ ఆంధ్ర సాదించి వికసిత్ భారత్ సాదనలో 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసి కట్టుగా పని చేస్తున్న సందర్భంలో ప్రతీ ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడవాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు.భవిష్యత్తులో కూడా చేయను.నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవటం, వారికి అండగా నిలబడటం,నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే.ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్ధం చేసుకుని ముందుకు సాగాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మార్చ్ 14 న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను.

    View this post on Instagram

    A post shared by JanaSena Party (@janasenaparty)

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleవిజయ్ కొత్త చిత్రం టైటిల్‌ ఇదే…!
    Next Article అండర్-19 టీ20 ప్రపంచ కప్: సూపర్ సిక్స్ లోనూ భారత్ విజయభేరీ

    Related Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    August 23, 2025

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    August 23, 2025

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    August 22, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.