ఓటీటీ సబ్ స్క్రిప్షన్ సబ్‌స్క్రైబర్లు ఏకకాలంలో లాగిన్ చేయగల 10 పరికరాల సంఖ్యను తగ్గించాలని అమెజాన్ ప్రైమ్ భావిస్తోందని తెలుస్తుంది.వచ్చే సంవత్సరం నుండి దీన్ని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.ఇకపై నుండి 5 డివైస్ లు వరకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది.ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు తమ ఖాతాలను ఏకకాలంలో 10 పరికరాల్లో యాక్సెస్ చేయవచ్చు. ఆ సంఖ్యను 5 పరికరాలకు తగ్గించాలని కంపెనీ అనుకుంటోంది.దీనికి తోడు వినియోగదారులు ఒకేసారి రెండు స్మార్ట్ టీవీలలో ప్రైమ్ వీడియో యాప్‌కి లాగిన్ అయ్యేలా మాత్రమే అనుమతించాలని భావిస్తోంది.దీనికి తగ్గట్టుగా మార్పులు చేయనుంది.వచ్చే ఏడాది అంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ రూల్స్ అప్లై కానున్నాయి.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు
ఇయర్ ప్లాన్: రూ. 1,499 (ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ఇతర ప్రయోజనాలు).
3 నెలల ప్లాన్: రూ. 599
ఒక నెల ప్లాన్: రూ. 299