ఇటీవల పరిణామాల నేపథ్యంలో భారత్- చైనా మధ్య పరిస్థితులు మెరుగవుతున్నాయి. వివాదాలు పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈక్రమంలో లిపులేఖ్ ప్రాంతం మీదుగా వాణిజ్య సరిహద్దులు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. కాగా, భారత విదేశాంగ శాఖ దీనిపై స్పందిస్తూ నేపాల్ అసమగ్రంగా ఉన్నాయని పేర్కొంది.
మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ దేశంలో భాగమని నేపాల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛెత్రి అన్నారు. తమ మ్యాప్ లో ఇదే ఉందని అన్నారు. ఇప్పటికే ఈవిషయాన్ని చైనా ప్రభుత్వానికి కూడా తెలియజేశామన్నారు. భారత్- నేపాల్ ల మధ్య ఉన్న సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చలతో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అయితే నేపాల్ వాదనలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైశ్వాల్ తీవ్రంగా స్పందించారు. లిపులేఖ్ ద్వారా భారత్- చైనాల మధ్య సరిహద్దు వాణిజ్యం తిరిగి ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవిషయంలో భారత్ వైఖరి చాలా స్పష్టంగా ఉందని లిపులేఖ్ ద్వారా మా వాణిజ్యం 1954లో ప్రారంభమైందని కొన్ని దశాబ్దాల పాటు కొనసాగి ఆ తర్వాత పలు కారణాల వల్ల ఇటీవల దానికి అంతరాయం కలిగింది. మళ్లీ తిరిగి దాన్ని ప్రారంభించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయని తెలిపారు.
భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్
By admin1 Min Read