దర్శకుడు సుకుమార్ సినిమాలు వదిలేస్తా అని సంచలన ప్రకటన చేశారు.ఇటీవల అమెరికాలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హారయ్యారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన్ను యాంకర్ సుమ ‘మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు? అని అడిగితే, సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నానని సమాధానం ఇచ్చారు.పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం ఈ ఘటన వల్ల అల్లు అర్జున్ తీవ్ర ఇబ్బందుల్లో పడటం తెలిసిందే.
ఈ ఘటన అనంతరం ఇటీవల తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై పరోక్షంగా విమర్శలు చేయడంతో ఈ వివాదం తారా స్థాయికి చేరింది.ఈ ఘటన అల్లు అర్జున్‌పై ఎంత ప్రభావం చూపించాయో తెలియదు,కానీ దర్శకుడు సుకుమార్ మాత్రం వీటి వలన మానసికంగా కృంగిపోయాడని తెలుస్తోంది.ఇటీవల‘పుష్ప-2’ సక్సెస్ మీట్‌లో, మహిళ మృతి గురించి మాట్లాడుతూ…దర్శకుడు సుకుమార్ తన బాధను వ్యక్తం చేశారు.అయితే తాజాగా ఏకంగా సినిమాలు వదిలేస్తా అని సంచలన ప్రకటన చేశాడు.ఈ ప్రకటనతో అందరూ షాక్ అయ్యారు.