బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావం వలన నేడు మధ్య, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో విస్తారంగా తేలికపాటి – మోస్తరు వర్షాలుంటాయి. నేడు అర్ధరాత్రికి వర్షాలు పుంజుకోనున్నాయి. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్లల్లో నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో దీని ప్రభావం స్వల్పంగా ఉండనుంది. అయితే రేపు రాత్రి నుండి పెరిగే అవకాశం ఉంది.
తమిళనాడు తీరానికి చేరువలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా స్వల్పంగా కదులుతుంది. కోస్తాంధ్ర ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల వెంబడి ఉన్న ప్రాంతాలలో ఈరోజు అర్ధరాత్రి సమయం తర్వాత చాలా వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. విజయవాడ, ఏలూరు, రాజమండ్రిలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రేపు రాత్రి నుండి తిరుపతి – నెల్లూరు – ప్రకాశం బెల్ట్‌ల వెంబడి వర్షాలు మెరుగుపడతాయి, అల్పపీడనం నైరుతి నుండి ఉత్తర – శ్రీలంక తీరం వైపు కదులుతుంది.
Previous Articleసినిమాలు వదిలేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సుకుమార్..!
Next Article ఫీచర్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త