సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు తాజాగా విచారించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ ఈ విచారణ జరిగింది. సంధ్య థియేటర్ ఘటన, ఇటీవల అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్‌మీట్ విషయాలపై ఆయన్ని ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ విచారణ సందర్భంగా ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్ర శేఖర్, స్నేహితుడు బన్నీ వాస్ తదితరులు చిక్కడపల్లి పీఎస్‌కు వచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, ఆదివారం అల్లు అర్జున్ నివాసంపై ఓయూజేఏసీ నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇంటి నుంచి పరదాలు ఏర్పాటు చేశారు. తాజాగా వాటిని తొలగించారు. పుష్ప 2 బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు హాజరు కావడంతో సినిమా హాలు ఆవరణలో తొక్కిసలాట జరిగింది. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీ తేజ తీవ్ర గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పోలీసులు వద్దని చెప్పినా అల్లు అర్జున్ బెనిఫిట్ షోకు హాజరయ్యాడని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Previous Articleస్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగించిన సూచీలు
Next Article కోహ్లీ నన్ను బ్లాక్ చేశాడు: బిగ్‌బాస్ నటుడు