మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శాతం జయంతి సందర్భంగా ఢిల్లీలోని ‘అటల్ సదైవ్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని మోడీ సహా ఎన్డీయే కూటమికి చెందిన పలువురు నేతలు నివాళులు అర్పించారు.
మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. బలమైన, సంపన్నమైన మరియు స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సంకల్పంలో బలాన్ని నింపడానికి ఆయన దార్శనికత దోహదం చేస్తుందని మోడీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా పలువురు నేతలు, అటల్ బిహారీ వాజపేయి అభిమానులు తమ నివాళులు తెలుపుతున్నారు.
Previous Articleదేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది..!
Next Article సూర్య కొత్త చిత్రం టైటిల్ టీజర్