బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు (నాలుగో టెస్టు) లో మొదటిరోజే ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. శామ్ కొన్స్టాస్ 60 (65;6×4, 2×6) అరంగ్రేటంలోనే దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుని ఆస్ట్రేలియాకు మంచి ఆరంభాన్ని అందించాడు. మార్నస్ లబుషేన్ 72 (145;7×4) మంచి ప్రదర్శన కనబరిచాడు. ఉస్మాన్ ఖవాజా 57 (121; 6×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. అలెక్స్ క్యారీ 31(41;1×6) పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్ (0), మార్ష్ (4) విఫలమయ్యారు. ప్రస్తుతం ఆట ముగిసే సమయానికి స్మిత్ 68 బ్యాటింగ్, పాట్ కమ్మిన్స్ 8 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, ఆకాష్ దీప్, జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

