ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్ కీలక నేత, కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ అజయ్ మాకెన్ విమర్శలు చేశారు. 40 రోజులపాటు 2013లో ఆ పార్టీకి మద్దతివ్వడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పని పేర్కొన్నారు. ఆ కారణంగా ఢిల్లీలో కాంగ్రెస్ బలహీనపడిందని అభిప్రాయపడ్డారు. ఆ పొరపాటును ఇప్పటికైనా సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది తన అభిప్రాయమేనని అన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ తాజాగా 12 అంశాలతో ఒక వైట్ పేపర్ విడుదల చేసింది. ఢిల్లీ లో పొల్యూషన్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్, మౌలిక వసతుల కల్పనలో విఫలమయ్యాయని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలపై అజయ్ మాకెన్ విమర్శించారు. జన్ లోక్ పాల్ అంశంలో ఆప్ తీరుని ఆక్షేపించారు. ఢిల్లీని లండన్ లా అభివృద్ధి చేస్తామన్నారని అయితే కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిపారని దుయ్యబట్టారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

