Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » భారత దేశ ఆర్థికశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్…!
    ఎడిటోరియల్

    భారత దేశ ఆర్థికశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్…!

    By adminDecember 27, 20243 Mins Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    చరిత్ర సృష్టించే గొప్ప ఆలోచనలను ఏ శక్తీ అడ్డుకోలేదు అనే ఫ్రెంచ్ తత్వవేత్త విక్టర్ హ్యూగో మాటను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిరూపించారు.భారతదేశం ప్రపంచశక్తిగా,ఆర్థిక శక్తిగా మారే సమయం వచ్చిందని,దానిని ఎవరూ ఆపలేరు అంటూ…అప్పటి ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణలు భారత ప్రగతిని పూర్తిగా మార్చేశాయని చెప్పాలి.దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మన దేశం అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది.అయితే సమస్యను ఎదుర్కోవడం కోసం ఆర్ధిక సంస్కరణలు చాలా అవరమని అందరికీ తెలుసు…కానీ రాజకీయ పార్టీల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎవరూ ఆర్ధిక సంస్కరణలు చేయడానికి ముందుకు రాలేదు.అయితే 1980 సమయంలో దేశంలో ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి.1990 నాటికి ఈ సమస్యలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రూపాన్ని సంతరించుకున్నాయి.

    1991 కంటే ముందు భారతదేశం భారీ రుణాలు తీసుకునే దేశం కాదు.కానీ అప్పటి పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.అంతకు ముందు వరకు చిన్న చిన్న రుణాల పైనే ప్రభుత్వం ఆధారపడింది.5 బిలియన్ డాలర్లకు రుణం చెల్లించాల్సి ఉంది.దానిపై వడ్డీ చెల్లించడానికి కూడా డబ్బు లేదు.అయితే కొన్ని నెలల అనంతరం ఆర్‌బీఐ దగ్గరున్న బంగారు నిల్వలను రెండు విదేశీ బ్యాంకుల దగ్గర పీవీ నరసింహారావు ప్రభుత్వం తాకట్టు పెట్టింది.

    ఇలాంటి విపత్కర పరిస్థితిల్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి అప్పు ఇచ్చింది.కానీ దానికి 25 షరతులు విధించింది.ఇందులో భారత దేశ ఆర్థిక వ్యవస్థను ఓపెన్ ఎకానమీగా మార్చడం ఒకటి.అలాగే ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు అంగీకరించాలి.ఈ సమయంలోనే మన్మోహన్ తెరపైకి వచ్చారు.1991 మే నెలలో ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీవ్ గాంధీ టికెట్ ఇవ్వకపోవడంతో పీవీ నరసింహారావు రాజకీయాల నుండి విశ్రాంతి తీసుకున్నారని అందరూ భావించారు.కానీ అనుకొని విధంగా రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు.దీనితో నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యారు.పీవీ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా తొలుత ఆర్థికవేత్త ఐజీ పటేల్‌ను అనుకున్నారు.కానీ చంద్రశేఖర్ ఆర్థిక సలహాదారుగా పని చేస్తున్న మన్మోహన్ సింగ్ పై పీవీ దృష్టి పడింది.అప్పటికి సింగ్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు మంచి పేరు ఉంది.ఈ కారణంగా అంతర్జాతీయ బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందవచ్చు అనే ఉద్దేశంతో మన్మోహన్ ను ఆర్థిక మంత్రిని చేయడం వెనుక ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు ఉద్దేశం.ప్రధానిగా ఆయన తీసకున్న నిర్ణయాల్లో ఇది చాలా గొప్ప నిర్ణయం.ఈ నిర్ణయం భారతదేశ అభివృద్ధికి నాంది పలికింది.డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి తనవంతు ప్రయత్నం చేశారు.మన్మోహన్ సింగ్ కు మేం మద్ధతిచ్చామని శేఖర్ గుప్తాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పీవీ నరసింహారావు స్వయంగా వెల్లడించారు.

    మన్మోహన్ సింగ్ ప్రవేశి పెట్టిన ఆర్థిక సంస్కరణలు వ్యతిరేకించిన వామపక్షాలు :-

    ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్ధిక సంస్కరణలను వామ పక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి.అయితే అప్పటి ప్రధానిగా పీవీ నరసింహరావు ఆయనకు అండగా నిలిచారు. 1991లో జూన్ నెలలో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఏర్పాటు అయింది.ఈ తర్వాత నెలలోనే ఈ చరిత్రాత్మక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.ఒక రకంగా ఈ బడ్జెట్ దేశం గతిని మార్చేసిందని చెప్పాలి.సాధారణంగా బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి 5 నెలల కాలం పడుతుంది.అయితే మన్మోహన్ సింగ్ ఒక నెలలోనే దానిని సిద్ధం చేశారు.ఈ బడ్జెట్ లోనే మన్మోహన్ తన ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్యంగా పరిశ్రమల శాఖలో అనేక మార్పులు చేశారు.అయితే ఈ శాఖను అప్పటి ప్రధాని పీవీ తన వద్దే ఉంచుకున్నారు.తన పార్టీలో కొంతమంది నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన ఈ సంస్కరణలను గట్టిగా అమలు చేశారు.కొద్దికాలంలోనే దీని ఫలితాలు కనిపించడం ప్రారంభించాయి.ఈ మేరకు ప్రభుత్వానికి ఆదాయం రావడం మొదలైంది.అలానే విదేశీ పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి.విదేశీ కంపెనీల రాక వల్ల భారతీయ కంపెనీలు దెబ్బతింటాయని లేదంటే విదేశీ కంపెనీలకు లోకల్ సప్లయర్లుగా మిగిలిపోతాయన్న ఆందోళన అప్పట్లో చాలా వ్యక్తం అయినప్పటికీ… భయపడినట్టుగా ఏమీ జరగలేదు.

    దీనితో మార్కెట్లో అనేక కొత్త ఉద్యోగాలు వచ్చాయి.దేశంలో కోట్ల మంది ప్రజలు తొలిసారిగా దారిద్య్ర రేఖకు ఎగువకు చేరుకున్నారు.ఈ బడ్జెట్ లో దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంపు,ఎగుమతులకు ప్రోత్సాహం,దిగుమతి లైసెన్సింగ్‌లో సడలింపులు వంటి సంస్కరణలు,ఫారిన్ ప్రత్యక్ష పెట్టుబడులతో ఉద్యోగాలు.సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు ప్రోత్సాహం వంటి ఎన్నో కొత్త సంస్కరణలు ప్రవేశ పెట్టారు.ఈ బడ్జెట్‌ను ఆధునిక భారతదేశ చరిత్రలో అతి పెద్ద నిర్ణయాలలో ఒకటిగా చెబుతారు.అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు,ఫైనాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్‌లకు ఈ బడ్జెట్ ఖ్యాతి దక్కింది.

    ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకున్న వచ్చిన సంస్కరణలు…!

    * గ్రామీణ ఉపాధిహామీ పథకం (2005)

    * సమాచార హక్కు (2005)

    * అణు ఒప్పందం (2008)

    * ఆధార్ పథకం (2009)

    * విద్యా హక్కు (2009)

    * మహిళా రిజర్వేషన్,

    * గ్రామీణాభివృద్ధి, సామాజిక,

    * ఆరోగ్య సంస్కరణలు

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: మొదటి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 474 ఆలౌట్:భారత్ 164-5
    Next Article కొరడాతో కొట్టుకున్న అన్నామలై కుప్పు స్వామి…!

    Related Posts

    ఆగష్టు 14.. దేశ విభజన గాయాల స్మారక దినం

    August 14, 2025

    ఎమర్జెన్సీ @ 50…స్వతంత్ర భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయం..!

    June 25, 2025

    భారత్ లో పరిశుభ్రత కోసం జపాన్ మహిళా నిస్వార్థ సేవా యజ్ఞం…!

    March 17, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.