బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు (నాలుగో టెస్టు) లో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 164-5తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ రిషబ్ పంత్ (28),రవీంద్ర జడేజా (17) వికెట్లను కోల్పోయినా నితీష్ కుమార్ రెడ్డి 105 నాటౌట్ (176; 10×4, 1×6) కెరీర్ లో మొదట సెంచరీతో, వాషింగ్టన్ సుందర్ 50 (162; 1×4) హాఫ్ సెంచరీలతో బ్యాటింగ్ భారాన్ని తమ భుజస్కంధాలపై మోశారు. కీలకమైన భాగస్వామ్యంతో భారత్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. పరిణితితో కూడిన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు, బోలాండ్ 3 వికెట్లు, లైయన్ 2 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు ఆలౌటయింది. ప్రస్తుతం భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 116 పరుగుల వెనుకంజలో ఉంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: చిరస్మరణీయ ఆటతీరుతో ఆకట్టుకున్న నితీష్ రెడ్డి(105*), వాషింగ్టన్ సుందర్ (50)
By admin1 Min Read