ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ను ఆయన కలిశారు. రామ్‌చరణ్ కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలో నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని పవన్‌ను కోరారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 4 లేదా 5వ తేదీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నానని ఇటీవల దిల్‌రాజు తెలిపారు.
Previous Articleక్యూట్ నెస్ తో మది గెలిచిన అలియా కుమార్తె రాహ…!
Next Article బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘోర పరాజయం