ఆదాయపు పన్ను శాఖతో పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడంలో పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2024లో ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని ప్రకటించింది.తక్కువ స్థాయి పన్ను వివాదాల పరిష్కారం కోసం పన్ను వివాదాలను సులభంగా పరిష్కరించుకునేందుకు దోహదం చేసే ఈ పథకం గడువును ఆదాయ పన్ను విభాగం పొడిగించింది. 2024 డిసెంబర్ 31 ఈ పథకం డెడ్లైన్ ముగియాల్సి ఉండగా మరో 15 రోజులపాటు చెల్లింపుదార్లకు అవకాశం కల్పించింది. 2025 జనవరి 15 వరకు గడువును పెంచుతున్నట్టు తాజాగా నేడు ప్రకటించింది.
వివాదాస్పద పన్నులో 10 శాతం చెల్లించి సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలు కల్పించింది. గడువు దాటిన తర్వాత, జనవరి 31 వరకు వివాదాస్పద పన్నులో 100 శాతం, లేదా, 25 శాతం ఆలస్య జరిమానా/వడ్డీ చెల్లించి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1 నుండి పన్నులో 110 శాతం లేదా వడ్డీలో 30 శాతం చెల్లించి వివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
Previous Articleఎలాన్ మస్క్ కు జర్మన్ ఛాన్సలర్ కౌంటర్
Next Article 2024 ఏడాదికి సంబంధించి ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్