ఏపీ మంత్రి నారా లోకేష్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్టు లోకేష్ ట్వీట్ చేశారు. గడచిన ఏడాదిలో రాష్ట్ర ప్రజలు విధ్వంస, నియంతృత్వ పాలనను తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని పేర్కొన్నారు . సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలని లోకేష్ అన్నారు.
ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి: మంత్రి నారా లోకేష్
By admin1 Min Read
Previous Articleకొత్త సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోంది: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article ‘బెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ లో బుమ్రా, జైశ్వాల్