క్రికెట్ ఆస్ట్రేలియా ‘బెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ ను ఎంపిక చేసింది. భారత్ నుండి యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, స్టార్ పేసర్ బుమ్రాకు స్థానం లభించింది. అంతేకాకుండా బుమ్రాను ఈ జట్టుకు కెప్టెన్ గా ఎంచుకుంది. 2024లో బుమ్రా 71 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో అతను 4 టెస్టులలో 30 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఇక జైశ్వాల్ 2024 లో 15 టెస్టు మ్యాచ్ లలో 1478 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా నుండి హేజల్ వుడ్, అలెక్స్ క్యారీ, ఇంగ్లాండ్ జట్టు నుండి జో రూట్, బెన్ డకెట్, బ్రూక్ సౌతాఫ్రికా నుండి కేశవ్ మహారాజ్, న్యూజిలాండ్ నుండి రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ, శ్రీలంక నుండి కమిందు మెండీస్ లకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ‘బెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ లో చోటు దక్కింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు