తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ కథానాయకుడిగా మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “విదా ముయార్చి”.ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది.ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావించింది.అయితే అనివార్య కారణాల వలన విడుదల వాయిదా వేస్తున్నామని చిత్రబృందం తాజాగా ప్రకటించింది.కొత్త విడుదల తేది గురించి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది.అజిత్ అభిమానులు ఇంకొంత కాలం వేచి ఉండాలని కోరింది.దీనిపై అజిత్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.లైకా ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఇందులో అర్జున్,రెజీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Previous Articleఅన్స్టాపబుల్ సెట్లో రామ్చరణ్ సందడి…!
Next Article మరో వివాదంలో మోహన్ బాబు కుటుంబం.. వీడియో వైరల్

