మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం గేమ్ ఛేంజర్.ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అన్‌స్టాపబుల్ సెట్‌లో రామ్ చరణ్ సందడి చేశారు.ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ…‘డాకు మహారాజ్’, ‘గేమ్ ఛేంజర్’ రెండు సినిమాలు విజయం సాధించాలని కోరుకున్నారు.‘గేమ్ ఛేంజర్’ లో కియారా అడ్వాణీ కథానాయికగా నటించింది.ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఇది సిద్ధమైంది.ఇందులో అంజలి,శ్రీకాంత్,సునీల్, ఎస్.జె.సూర్య కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందస్తున్నాడు.
Previous Articleసమంతకు కీర్తి సురేశ్ థాంక్స్
Next Article సంక్రాంతి బరి నుండి తప్పుకున్న అజిత్ …!

