రజనీకాంత్ కథాయకుడిగా నటించిన ఓ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు నటి ఖుష్బూ. అందులో యాక్ట్ చేసినందుకు తాను ఎంతో బాధపడ్డానని అన్నారు.కథ చెప్పినప్పుడు తన పాత్రకు సినిమాలో వచ్చినదానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.‘మీనా నేను ఆ సినిమా యాక్ట్ చేశాం…రజనీకాంత్ పక్కన మా ఇద్దరివి కీలక పాత్రలని మొదట మాకు చెప్పారు.ఆయనతో డ్యూయెట్స్ కూడా ఉంటాయన్నారు.వేరే కథానాయికలు ఎవరూ ఇందులో ఉండరని భావించి వెంటనే ఓకే చెప్పా.తీరా చూస్తే ఇందులో వేరే కథానాయికగా భాగం చేశారు.డబ్బింగ్ సమయంలో సినిమా చూసి ఎంతో బాధపడ్డా.ఎందుకు నటించనా? అనిపించిందని ఖుష్బూ తెలిపారు.అయితే తాను ఏ సినిమా గురించి అనేది మాత్రం చెప్పలేదు.ప్రేక్షకులు మాత్రం ఆమె ‘అన్నాత్తే’ గురించే చెబుతున్నారని భావిస్తున్నారు.రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన సినిమాలో మీనా,ఖుష్బూ నటించారు.నయనతార కథానాయికగా నటించారు.ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం 2021లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది.
Previous Articleఐక్య రాజ్య సమితిలో తాత్కాలిక దేశంగా పాక్
Next Article క్యాన్సర్ నుండి కోలుకున్న శివరాజ్ కుమార్…!