పాకిస్థాన్ నేటి నుండి ఐక్యరాజ్యా సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరింది.దీనిపై ఆ దేశ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ మాట్లాడుతూ తమ దేశం చురుకైన నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందని పేర్కొన్నారు.ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారం కోసం తమ బృందం యత్నిస్తుందన్నారు.2026డిసెంబరు వరకు ఐరాసలోని 10 తాత్కాలిక సభ్యదేశాల్లో ఒకటిగా ఉంటుంది పాకిస్థాన్.
ఇప్పటి వరకు జపాన్ ఉన్న ఈ స్థానంలో ఇక నుంచి పాక్ వచ్చి చేరనుంది.దీంతో పాటు డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా దేశాలు కూడా కొత్తగా భద్రతా మండలిలోకి వచ్చాయి.గతంలో పాకిస్థాన్ 2012-13, 2003-04, 1993-94, 1983-84, 1976-77, 1968-69, 1952-53లో భద్రతా మండలితో కలిసి పనిచేయడం గమనార్హం.