ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు సినిమా తీయడంలో హిందీ చిత్ర పరిశ్రమ విఫలమైంది అని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు.ఆ కారణం వల్లే సౌత్ సినిమాలు,అక్కడి ఫిల్మ్ మేకర్స్ ఇక్కడ మార్కెట్ లో రాణిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.మేము హిందీ సినిమాలు తీస్తాం.కానీ హిందీ ఆడియెన్స్ ను పట్టించుకోం…దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి సౌత్ సినిమాలను తక్కువ ధరకు కొని…వాటిని డబ్ చేసి హిందీ ఆడియెన్స్ కు అందిస్తున్నారు.ఆ విధంగా సౌత్ సినిమాలకు ఇక్కడ ఆడియెన్స్ పెరిగారు.అందువల్లే పుష్ప సినిమా ఈవెంట్ ను పాట్నాలో నిర్వహించారని అనురాగ్ అన్నారు
బాలీవుడ్ నిర్లక్ష్యం వల్లే సౌత్ సినిమాలు ఇక్కడికి వస్తున్నాయి:- అనురాగ్ కశ్యప్
By admin1 Min Read