తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిత్యం కార్యకర్తలకు అండగా నిలిచేలా ఎన్నో ప్రయోజక కార్యక్రమాలు చేపడుతున్నారు నారా లోకేష్. ఇక ఈక్రమంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈమేరకు మంత్రి లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుండి డిసెంబర్ 31,2025వరకు కోటిమంది కార్యకర్తల భీమా కోసం తొలివిడతలో రూ.42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద భీమా లభించనుంది. కార్యకర్తల సంక్షేమ నిధి లీడర్ గా లోకేష్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తల పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూల్స్ , కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ వంటివి అందులో ఉన్నాయి.
కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా ఇన్సూరెన్స్ కంపెనీతో లోకేష్ ఎంఓయూ
By admin1 Min Read