బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మంచు మనోజ్,నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భైరవం’. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో అదితి శంకర్,దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలుగా నటిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈరోజు సాయి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్రబృందం తాజాగా ‘ఓ వెన్నెల’ ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది.సాయి శ్రీనివాస్,అదితి శంకర్‌పై చిత్రీకరించిన ఈపాటకు తిరుపతి జావన లిరిక్స్ అందించారు.అనురాగ్ కులకర్ణి,యామిని ఆలపించారు.ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
Previous Articleఆప్‌పై ప్రధాని మోదీ విమర్శలు…!
Next Article అల్లుఅర్జున్‌కు బెయిల్ మంజూరు…!