డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతోన్న విషయం తెలిసిందే.బీజేపీ,ఆప్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.తాజాగా ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.డిల్లీ డెవలప్‌మెంట్ అథారటీ ఆధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను ప్రధాని నేడు ప్రారంభించారు.అనంతరం జరిగిన సభలో ఇటీవల చోటుచేసుకున్న సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని ఆయన అన్నారు.తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదన్నారు.ఈ సందర్భంగా అధికార పార్టీని విపత్తుగా పేర్కొన్న మోదీ.. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
Previous Articleఅగ్రరాజ్యంలో వరుస ప్రమాదాలు…ట్రంప్ కీలక పోస్ట్
Next Article భైరవం.. ఓ వెన్నెల ఫుల్ లిరికల్ వచ్చేసింది

