హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈకార్యక్రమానికి హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభమయ్యాయని అన్నారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు శ్రీకాకుళం నుండి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటేనని అదే తెలుగుజాతి అని పేర్కొన్నారు. ఏం చేయాలన్నా ఒక దూరదృష్టి ఉండాలి. ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. భవిష్యత్ లో జరగబోయే విషయాలను మనం ముందుగానే ఆలోచించాలి. తగిన విధంగా ముందుకు వెళ్లగలిగితే ఏదైనా సాధ్యమేనని పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీ ఎప్పటికీ తెలుగు వారి సొంతమని ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. 25 సంవత్సరాల్లో ఇది సాధ్యమైందని వివరించారు.
తెలంగాణ, ఏపీ, ఆస్ట్రేలియా, అమెరికా.. ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడకు వచ్చారు. వివిధ దేశాల సమాఖ్యల అధ్యక్షులు ఇక్కడకు వచ్చారు. నా జీవితంలో ఇది ఎంతో సంతోషకరమైన రోజని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగువారు ఎక్కడున్నా రాణిస్తున్నారు. 1996లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ తిండి పెడుతుందా అని అప్పట్లో ఎంతో మంది హేళన చేశారు. సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే ఏమన్నా ఉపయోగమా? అని ప్రశ్నించారు. కానీ ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు దూసుకెళ్తున్నారని స్పష్టం చేశారు.
ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటే:ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read