దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్ షెడ్యూల్ రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. తాజాగా బీజేపీ కూడా తమ అభ్యర్ధులకు సంబంధించిన మొదటి జాబితాను విడుదల చేసింది. మొదటి విడతలో 29 మందితో జాబితా ప్రకటించింది. న్యూఢిల్లీ స్థానం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు పోటీగా బీజేపీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మను బరిలోకి దించనుంది. ఈయన మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు 2014-2024 వరకు వెస్ట్ ఢిల్లీ ఎంపీగా కొనసాగారు. 2019లో ఢిల్లీ చరిత్రలోనే 5లక్షల 78 వేల మెజారిటీతో విజయం సాధించి సత్తా చాటారు. ఇక కాంగ్రెస్ ఇప్పటికే ఆ స్థానంలో మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పేరును ప్రకటించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొదటి జాబితాను విడుదల చేసిన బీజేపీ
By admin1 Min Read