దేశాభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకమని అటువంటి గ్రామీణాభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ‘గ్రామీణ భారత మహోత్సవం-2025 ‘ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను గత ప్రభుత్వాలు విస్మరించాయని దాని వలన గ్రామాల నుండి పట్టణాలకు వలసలు పెరిగాయని ఫలితంగా పట్టణాల్లో కూడా పేదరికం పెరిగిందని చెప్పారు. సమాజంలో ఎంత మారినా గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాలు పెరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రగతి చూడని ప్రాంతాలు తమ హాయాంలో సమాన ప్రాధాన్యత సంతరించుకున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విధానాల వలన గ్రామీణ భారతానికి నూతన శక్తిని నింపుతున్నాయని అన్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలను కూడా దేశాభివృద్ధిలో భాగం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లో భారత్ లోని మారుమూల ప్రాంతాలు ఎలా ఎదుర్కుంటాయోనని ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేశాయని అయితే తమ ప్రభుత్వం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేసినట్లు వివరించారు. టెక్నాలజీ ఉపయోగించి దేశంలోని అత్యున్నత డాక్టర్లు, హాస్పిటల్స్ గ్రామాలకు కనెక్ట్ చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రజలు ప్రస్తుతం టెలీ మెడిసిన్ సౌకర్యాలు పొందుతున్నారని చెప్పారు. పల్లెల్లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. పీఎం-కిసాన్ పథకం కింద, కేంద్రం రైతులకు రూ.3 లక్షల కోట్ల ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల వలన గ్రామీణ భారతంలో పేదరికం దాదాపు 26 శాతం నుండి 5 శాతానికి తగ్గిందని తెలిపారు.
గ్రామీణ భారతానికి నూతన శక్తినిచ్చేలా కృషి చేస్తున్నాం: ప్రధాని మోడీ
By admin1 Min Read
Previous Articleమహాకుంభ మేళా లో శ్రీవారి నమూనా ఆలయం
Next Article గేమ్‌ఛేంజర్ టికెట్ ధరలు పెంపు….!