తన కుమార్తెల విషయంలో ఎంతో గర్వంగా ఉన్నట్లు చెప్పారు నటుడు బాలకృష్ణ. పెద్దమ్మాయి బ్రాహ్మణికి గతంలో సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘మణిరత్నం తెరకెక్కించిన ఓ సినిమాలో మా అమ్మాయికి అవకాశం ఇచ్చారు. కాకపోతే ఆమె ఆసక్తి కనబరచలేదు. కెమెరా ముందుకు రావడానికి ఇష్టం లేదని చెప్పింది. ఆ ఆఫర్ రిజెక్ట్ చేసింది’’ అని బాలయ్య చెప్పారు. ఇప్పుడు పిల్లలిద్దరూ వారి వారి రంగాల్లో రాణిస్తున్నారని అందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. బ్రాహ్మణి అంటే తనకు కాస్త భయం అని ఆయన సరదాగా చెప్పారు.
Previous Articleకాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి: కేజ్రీవాల్
Next Article శంకర్‌ను ఆ మాట అడగడానికి ధైర్యం చాల్లేదు: రామ్‌చరణ్