ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ రాజేపడడం లేదు.ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం ఎంత వరకు అయిన వెళ్తున్నారు.కల్కాజీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేశ్ బిధూరి ప్రత్యర్థులపై ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఆదివారం జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ..తాను గెలిస్తే నియోజకవర్గంలోని రోడ్లను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చెంపలంత నునుపుగా మారుస్తానని అన్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ సహచర ఎంపీని దూషించి ఎలాంటి శిక్ష అనుభవించని వ్యక్తి నుంచి ఇంతకు మించిన ప్రవర్తన ఏం ఆశిస్తామని ప్రశ్నించింది.
విమర్శలు పెరగడంతో బిధూరీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.మరోవైపు ఆయన డిల్లీ
ముఖ్యమంత్రి ఆతిశీపైనా బిధూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఆతిశీ తన తండ్రి పేరునే మార్చేశారని ఆరోపించారు.ఒకప్పుడు మర్లేనాగా ఉన్న ఆతిశీ ఇప్పుడు సింగ్ అయ్యారని,ఆమె తన తండ్రినే మార్చేశారని అన్నారు.బిధూరీ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా అన్ని హద్దులు దాటేశారని ఆయన విమర్శించారు.