పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘సీజ్ ద షిప్’ అంటూ ఆదేశించడం జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాకినాడ సముద్రతీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన ఆ స్టెల్లా షిప్ కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఆ నౌకలో అధికారులు గుర్తించిన రేషన్ బియ్యం అన్ లోడ్ చేసే ప్రక్రియ పూర్తి కావడంతో పాటు షిప్ నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజ్ చార్జి, కార్గో షిప్ లోకి ఎక్కించినందుకు కట్టాల్సిన ఎక్స్ పోర్టు రుసుము పోర్టు అథారిటీకి స్టెల్లా నౌక స్టీమర్ ఏజెంట్ చెల్లించి నోడ్యూస్ ధ్రువీకరణ పొందడంతో కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో స్టెల్లా షిప్ పశ్చిమ ఆఫ్రికా తీరం వెళ్లడానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ విషయాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తాజాగా ధ్రువీకరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు