ఏపీ సీఎం చంద్రబాబు నేడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం లో పర్యటించారు. ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన సభలో కుప్పం విజన్-2029 డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నెను ఎక్కడ ఉన్నా కుప్పం ఎమ్మెల్యేని, మీ మనిషిని అని వ్యాఖ్యానించారు. రాజకీయాల ద్వారా మంచి పబ్లిక్ పాలసీ తీసుకుని వస్తే, ప్రజల జీవితాలు బాగుపడతాయని పేర్కొన్నారు. ఏవ్యక్తి అయిన దూరదృష్టితో, ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తేనే విజయం వస్తుందన్నారు. 1995లో ఎవరూ ఊహించని విధంగా విజన్ 2020 గురించి మాట్లాడాను. అది ఇప్పుడు రియాలిటీ అని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్ళీ స్వరాంధ్రవిజన్ 2047తో ప్రజల ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఎన్టీఆర్ గారి దూరదృష్టికి నిదర్శనం, కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ అని గుర్తు చేశారు. ఏపీని అభివృద్ధి, సంక్షేమం దిశగా తీసుకెళ్తున్నాం. కుప్పంకు పెట్టుబడులు తెచ్చి ఉపాధి కల్పిస్తాం. కష్టపడితేనే అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు. నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. జూన్‍లోపు హంద్రీనీవా జలాలు పాలారు వాగుకు తెస్తాం. పాలారువాగుపై చెక్‍డ్యామ్ నిర్మాణం చేపడతామని వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు