రేపు,ఎల్లుండి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు.ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని రెండు రాష్ట్రాల భాషల్లో ట్వీట్ చేశారు.’విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటానని తెలిపారు.అయితే విశాఖపట్నం ప్రజల మధ్య సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ,కృష్ణ పట్నం పారిశ్రామిక ప్రాంతం శంకుస్థాపన కార్యక్రమాలలో కూడా పాల్గొంటానని పేర్కొన్నారు.
రేపు,ఎల్లుండి రెండురోజులు నేను ఆంధ్ర ప్రదేశ్, ఒడిశాలలో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటాను. విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలతోపాటు భువనేశ్వర్ లో జరిగే ప్రవాసి భారతీయ దివస్ వేడుకలలో పాల్గొంటాను.
— Narendra Modi (@narendramodi) January 7, 2025

