కుప్పం ఎన్టీఆర్ స్టేడియంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కుప్పం మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయటానికి, రూ.92 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మదర్ డెయిరీ ఫ్రూట్ విజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.105.10 కోట్ల వ్యయంతో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. 4800 మందికి ఉపాధి దిశగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఐపీ తంబి గానిపల్లి, తంబి గానిపల్లి గ్రామం వద్ద 40 ఎకరాలలో ఏసీఐఐసీ ద్వారా శ్రీజ ప్రొడ్యూసర్ కంపెనీ దాదాపు రూ.233 కోట్లతో 4000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా 8 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సాగు బాగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకృతి సాగులో పండిన ఉత్పత్తులకు మంచి ధర వస్తుందని వివరించారు. ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని ప్రజలు అందిపుచ్చుకోవాలని సూచించారు. 2047 నాటికి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన జీవనానికి అనుగుణమైన ప్రదేశంగా కుప్పం తయారు కావాలి. కుప్పంకు అన్ని రకాల విద్య, వైద్య సంస్థలు రావాలని అన్నారు.
2047 నాటికి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం మారాలి: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read