పని లేకుండా ఉన్న వారికి ఉచితాల పేరుతో పంచడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులుంటాయిగానీ…జిల్లా న్యాయ వ్యవస్థల్లోని జడ్జీలకు జీతాలు,పెన్షన్లు ఇవ్వడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డువస్తాయని సుప్రీంకోర్టు
ఆక్షేపించింది.ఎన్నికలు రాగానే పథకాలను ప్రకటించి కచ్చితమైన సొమ్మును పంచుతారు.ఢిల్లీ ఇప్పుడు ఒక పార్టీ రూ.2,500 ఇస్తామంటే మరోపార్టీ ఇంకా ఎక్కువ ఇస్తామంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్లితో కూడిన ధర్మాసనం l వ్యాఖ్యానించింది.పదవీ విరమణ చేసిన జడ్జీలకు పెన్షన్లపై 2015లో అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.న్యాయాధికారుల జీతాలు,పదవీ విరమణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఆర్థిక పరిమితులను పరిగణనలోకి తీసుకుంటుందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్
వెంకటరమణి కోరుకు తెలిపారు.దీనితో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రభుత్వాల తీరును తప్పు పట్టింది.
పథకాల పేరుతో ఉచితంగా డబ్బులు ఇస్తారు కానీ.. జడ్జీల జీతాలు చెల్లించారా?
By admin1 Min Read