ప్రపంచ వ్యాప్తంగా జనాభా తగ్గుదలపై ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటిగా ఆయన తెలిపారు.జనాభా తగ్గుదలకు సంబంధించి టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ ఎక్స్ వేదికగా ఓ గ్రాఫ్‌ను పోస్టు చేసింది.ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్,చైనా సహా నైజీరియా,అమెరికా,ఇండోనేషియా,పాకిస్థాన్ వంటి కీలక దేశాల్లో 2018 నుంచి 2100 మధ్య జనాభాలో ఎలాంటి మార్పులు ఉండనున్నాయనే దాన్ని ఈ గ్రాఫ్‌లో తెలియజేశారు.ముఖ్యంగా భారత్,చైనా దేశాల్లో 2100 నాటికి జనాభా క్షీణత తీవ్రంగా ఉంటుందని అందులో పేర్కొన్నారు.‘జనాభా తగ్గుదల మానవాళికి అత్యంత ముప్పు’ అని రాసుకొచ్చింది.ఈ ట్వీట్‌ను రీపోస్ట్ చేసిన మస్క్ ‘అవును’ అని తెలిపారు.
Previous Articleవైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకే పెద్దపీట
Next Article గేమ్ ఛేంజర్.. ‘కొండ దేవర’ వచ్చేసింది..!