అమెరికా అధ్యక్షుడిగా ఈనెల 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఆయన రెండవసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్నారు. 47 వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. అమెరికా క్యాపిటల్ భవనం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానున్నట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమానికి భారత్ తరపున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ఆయన కొత్త ప్రభుత్వ అధికారులతో పాటు వివిధ దేశాల అధినేతలతో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది.
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి జైశంకర్
By admin1 Min Read

