ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తాజాగా ఢిల్లీ ఎన్నికల బరిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం నేతృత్వంలోని అజిత్ పవార్ ఎన్సీపీ నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 25-30 స్థానాలలో ఆ పార్టీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేయనుంది. మహారాష్ట్రలో అజిత్ పవార్ ఎన్సీపీ బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతోంది. అయితే ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్న అజిత్ పవార్ ఎన్సీపీ?
By admin1 Min Read

