సంక్రాంతి పండుగ సందర్భంగా ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి స్టార్ షట్లర్ సింధు తదితర ప్రముఖులు కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా… ప్రధాని ఆసక్తిగా తిలకించారు. భారతదేశం అంతటా ప్రజలు సంక్రాంతిని,పొంగల్ ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది మన సంస్కృతిలోనూ,వ్యవసాయ సంప్రదాయాలలోనూ అంతర్భాగమైన కృతజ్ఞత, సమృద్ధి, పునరుద్ధరణల వేడుక. సంక్రాంతి, పొంగల్ పండుగల శుభాకాంక్షలు. అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతో పాటు రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నట్లు ప్రధాని ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు.
Previous Articleఆస్ట్రేలియన్ ఓపెన్: రెండో రౌండ్ లో జకోవిచ్
Next Article ఘనంగా ప్రారంభమైన ఖోఖో ప్రపంచకప్

